బుల్లి తెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్ద కాలంగా బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే వెండి తెరపై కూడా అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. ఈ ఛానల్.. ఆ ఛానల్ అనే పట్టింపు లేకుండా ప్రతి ఒక్క ఛానల్ లో కూడా కనిపిస్తూ ఉండే శ్రీముఖి కి తెలుగు ప్రేక్షకుల్లో హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏ షో చేసినా.. యూట్యూబ్ వీడియో షేర్ చేసినా చివరకు ఇన్ స్టా రీల్ చేసినా కూడా అభిమానులు మిలియన్ ల కొద్ది వ్యూస్ తో ప్రేమను చూపిస్తూ ఉంటారు.
ఈమద్య కాలంలో శ్రీముఖి వయసు మీద జోకులు తెగ పేలుతున్నాయి. ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు.. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదా.. మంచి అబ్బాయి దొరికేనా అంటూ రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. ఈ సమయంలో శ్రీముఖి ప్రేమలో ఉంది అనే ప్రచారం కూడా జరిగింది. ఒక యాంకర్ తోనే ఈమె ప్రేమలో ఉందనే పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత అతడి నుండి తామిద్దరం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ వచ్చింది.
ఆ యాంకర్ నుండి శ్రీముఖి దూరం అయ్యిందని ఆమద్య పుకార్లు షికార్లు చేశాయి. అలా ఎప్పటికప్పుడు శ్రీముఖి ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లుగా జనాలు కుప్పలు తెప్పలుగా పుకార్లు పుట్టిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లు తన పెళ్లి గురించి వచ్చిన పుకార్లను.. మీమ్స్ మరియు జోక్స్ అన్నింటిని కూడా భరిస్తూనే వస్తున్న శ్రీముఖి త్వరలో కీలక ప్రకటన చేయబోతున్నట్లుగా అనిపిస్తుంది.
ఫేస్ బుక్ లో ఈ అమ్మడు ఈ వాలెంటైన్స్ డే చాలా స్పెషల్.. జీవితంలో ఎప్పుడు ఇలాంటి వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకోలేదు అన్నట్లుగా పోస్ట్ పెట్టింది. అంతే కాకుండా ఈ తేదీని గుర్తు పెట్టుకోండి.. తప్పకుండా మనం ఈ తేదీ గురించి తర్వాత మాట్లాడుదాం అంటూ పోస్ట్ పెట్టింది. అదే సమయంలో ఆమె ఎర్ర గులాబీల బొకేను చేతిలో పట్టుకుంది. ఆ బొకే ను ఆమె ప్రియుడు ఇచ్చాడని క్లీయర్ గా అర్థం అవుతుంది.
శ్రీముఖి మొహంలో ఎప్పుడు కనిపించని సిగ్గు మరియు ఒక ఆనందం కనిపిస్తుంది. ఆ సిగ్గు మరియు అందం ఆనందం ఖచ్చితంగా ప్రేమలో పడటం వల్లే అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆమె ఇంకా తన ప్రేమ వ్యవహారాన్ని దాస్తుంది.. ఏ విషయం లో ఆమె తన ప్రేమను హైడ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది అంటూ నెట్టింట చర్చ మొదలు అయ్యింది.
ఇప్పటికే బుల్లి తెరపై ఎంతో ఎంటర్ టైన్మెంట్ ను అందించిన ఈ అమ్మడు ముందు ముందు పెళ్లి చేసుకుని కూడా బుల్లి తెరపై సందడి చేయడం ఖాయం. కేవలం బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా ఈమె కంటిన్యూ అవ్వాలని అభిమానులు ఆశపడుతున్నారు. హీరోయిన్ గా కాకున్నా కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా ఈమె సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతకు ఈమె ప్రేమ విషయమై క్లారిటీ వచ్చేది ఎప్పుడు.. ఆ ప్రేమ పెళ్లిగా మారేది ఎప్పుడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.