రాజశేఖర్ హీరోగా శ్రీను వైట్ల అపరిచితుడు!

అసలు వినడానికే వింతగా అనిపించే కాంబినేషన్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిందట. కామెడీ చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా ఒకప్పుడు వెలిగొందిన శ్రీను వైట్ల డెబ్యూ అసలు రాజశేఖర్ హీరోగా జరగాల్సిందిట. ఆ సినిమాకు అపరిచితుడు అనే పేరుని కూడా ఫైనలైజ్ చేసినట్లు శ్రీను వైట్ల తెలిపాడు.

ఇటీవలే అలీతో సరదాగా షో కు వచ్చాడు శ్రీను వైట్ల. ఈ సందర్భంగా ఎపిసోడ్ ప్రోమో విడుదలయింది. అందులో చాలానే విశేషాలను తెలిపాడు. ఆగడు సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం కూడా రివీల్ చేసాడు. దూకుడు తర్వాత మా కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ మంచి మాస్ సినిమా కావాలని ఒకటే పోరు పెట్టారని, అయితే ఇతరుల గురించి కాకుండా మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి సినిమా తీయాలని పాఠం నేర్చుకున్నట్లు తెలిపాడు.

ఇక నీకోసం సినిమా చూసి రామోజీ రావు ఆనందం ఆఫర్ ఇచ్చినట్లు, ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదని శ్రీను వైట్ల అన్నాడు.