తండ్రయిన సుధీర్‌.. రష్మీ సూపర్‌ పంచ్‌

జబర్దస్త్‌ లో కమెడియన్స్ లేడీ గెటప్ వేయడంతో పాటు కామెడీ పండించడంకు ఎలాంటి పాత్రలు అయినా చేసేందుకు సిద్దంగా ఉంటారు, ఎలాంటి పాత్రలో కనిపించేందుకు అయినా రెడీ అంటారు. సుధీర్‌ మరోసారి కామెడీ పండించేందుకు గాను సిగ్గును పక్కకు పెట్టి ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లుగా స్కిట్‌ చేశాడు. కొన్ని వారాల క్రితం వచ్చిన స్కిట్‌ ల్లో సుధీర్ గర్బం దాల్చినట్లుగా చేసి నవ్వించాడు. అబ్బాయి అయిన సుధీర్‌ గర్బందాల్చిన తర్వాత ఒక బిడ్డకు జన్మనిస్తే ఎలా ఉంటుంది అనేది వచ్చ వారం ప్రసారం కాబోతున్న స్కిట్‌ లో చూపించబోతున్నారు. ఆ స్కిట్‌ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.

ప్రోమో ఆకట్టుకోవడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సుధీర్‌ ఆ పాత్రలో అలరించాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. కమెడియన్‌ సుధీర్‌ తో ఆటో రామ్‌ ప్రసాద్ చేసిన కామెడీ మామూలుగా లేదు. నువ్వు అబ్బాయివి అయ్యి ఉండి కడుపు రావడం ఏంటో బిడ్డ పుట్టడం ఏంటో అంటూ రామ్‌ ప్రసాద్‌ కామెడీ చేశాడు. బిడ్డ ఏడవకుండా ఏదైనా పాట పాడవచ్చు కదా అంటూ రామ్‌ ప్రసాద్‌ అడగడంతో అడిగా అడిగా అంటూ పాట పాడితే అంత మందిని అడిగావ్ కాబట్టే నీకు ఇలా జరిగిందని అంటూ పంచ్‌ వేసింది. ఈ స్కిట్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.