బన్నీ సుక్కూ అనబడే సుకుమార్ లది వండ్రఫుల్ కాంబో. ఈ ఇద్దరు కలసి ఆర్య ఆర్య టూ సినిమాలు చేశారు. ఆ రెండూ సూపర్ డూపర్ హిట్స్. ఆర్య అయితే బన్నీని ఏకంగా స్టార్ చేసిన మూవీ. ఇక ఆర్యా టూ వచ్చిన పదమూడేళ్ల తరువాత పుష్ప మూవీ వీరి కాంబోలో వచ్చింది. దీంతో హ్యాట్రిక్ విక్టరీని ఇద్దరూ కొట్టారు. పుష్ప విషయంలో సుకుమార్ కి అల్లు అర్జున్ మీద ఒక విషయంలో నమ్మకం లేదట.
ఆయనే దాన్ని సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చారు. ఈ మూవీని పక్కా తెలుగులోనే తీయాలనుకున్నాను. ఎందుకంటే అడ్డపంచె కట్టించి నా హీరోను అచ్చ తెలుగు పద్ధతిలో చూపిస్తున్నాను ఈ సినిమా తెలుగుకే పరిమితమని నా భావన అని సుకుమార్ అన్నారు. అయితే మల్లూ అర్జున్ అంటారు కాబట్టి మళయాళంలో ఏమైనా బొమ్మ ఆడితే ఆడవచ్చు అన్నది మాత్రం ఉంది.
అయితే ఈ విషయంలో మాత్రం హీరో అర్జున్ నిర్మాతలు అసలు ఊరుకోలేదు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తీయాల్సిందే అని పట్టు పట్టారు. సరే అని మూవీ తీశాము. కానీ ఆ తరువాత కూడా నాకు నమ్మకం కలగలేదు అయితే ఉత్తరాదిలో సినిమా ఇంత రేంజిలో ఊపేస్తుంటే మాత్రం నాకే షాక్ గా ఉంది అన్నారు సుకుమార్.
మొదటి రోజున వచ్చిన కలెక్షన్లు ఈ రోజుకీ తగ్గలేదు అంటే పుష్ప రేంజి ఏంటి అన్నది అర్ధమవుతోంది అన్నారు. అంతే కాదు అల్లు అర్జున్ మీద నాకున్న అంచనా తప్పు అని కూడా ఇపుడు తెలిసింది. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అని గట్టిగా చెబుతున్నా అంటున్నారు సుకుమార్. మొత్తానికి బన్నీ ప్రొడ్యూసర్స్ కనుక పట్టిబట్టి ఉండకపోయి ఉంటే పుష్ప తెలుగు సినిమాగానే మిగిలిపోయి ఉండేది అన్నది సుక్కూ మాటల బట్టి అర్ధమవుతోంది. ఏది ఏమైనా బన్నీని బాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత మాత్రం సుక్కూకే దక్కింది అని చెప్పాలి.