సుక్కూ – దేవరకొండ కూడా సైడ్ అయినట్లేనా?

సుకుమార్ ఇప్పుడు మళ్ళీ నెంబర్ 1 దర్శకుడు అనిపించుకున్నాడు. తను మనసు పెట్టి మాస్ సినిమా చేస్తే ఎంతటి సెన్సేషన్ అవుతుందో పుష్పతో మరోసారి తెలియజేసాడు. ప్రస్తుతం పుష్ప 2 పై దృష్టి పెట్టిన సుకుమార్, తర్వాత విజయ్ దేవరకొండతో చిత్రాన్ని చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చి ఏడాది దాటిపోయినా ఒక్కసారి కూడా దీని గురించి అటు సుకుమార్ కానీ, ఇటు విజయ్ దేవరకొండ కానీ ఏ అప్డేట్ ఇవ్వలేదు, ప్రాజెక్ట్ అంగుళం కూడా కదల్లేదు.

సుకుమార్ పుష్ప 2 తర్వాత తమిళ స్టార్ హీరోతో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత మరోసారి పూరితో వర్క్ చేస్తాడని సమాచారం. శివ నిర్వాణ తో చేయబోయే చిత్రాన్ని సైడ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే సుకుమార్ తో చిత్రాన్ని కూడా విజయ్ వదులుకున్నాడా? లేదా?

ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ త్వరలోనే వస్తుందని అంటున్నారు.