విడాకులపై స్పందించిన అక్కినేని హీరో

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సుమంత్‌ కెరీర్‌ ఆరంభంలో కాస్త పర్వాలేదు అనిపించినా కూడా రాను రాను ఆయన సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోకుండా అయ్యింది. వరుసగా సినిమాలు నిరుత్సాహపర్చడంతో సినిమాల సంఖ్యను కూడా సుమంత్‌ తగ్గించాడు. ఏడాదికి రెండేళ్లకు ఒక్క సినిమాను చేస్తున్నాడు. సినీ కెరీర్‌ పరంగానే కాకుండా సుమంత్‌ వ్యక్తిగతంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న కీర్తి రెడ్డితో విడాకులు అయ్యాయి. పెళ్లి అయిన కేవలం రెండేళ్లకే ఇద్దరు విడిపోయారు. విడాకుల గురించి గతంలో పెద్దగా స్పందించని సుమంత్‌ తాజాగా ఒక వెబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు. కీర్తి రెడ్డితో ఇంకా కూడా స్నేహం కొనసాగుతున్నట్లుగా సుమంత్‌ చెప్పాడు.

పెళ్లి అయిన రెండు సంవత్సరాల తర్వాత మేము కలిసి ఉండటం సాధ్యం కాదనిపించింది. ఇద్దరం కలిసి ఉండటం కంటే విడిపోవడం వల్లే సంతోషంగా ఉంటామని భావించాం. ఇద్దరం కూడా స్నేహపూర్వకంగానే విడిపోయాం. విడిపోయిన తర్వాత కూడా మేము స్నేహితులుగా కొనసాగుతున్నాం.

విడాకుల తర్వాత కీర్తి రెడ్డి మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికి కీర్తి రెడ్డి కుటుంబ సభ్యులతో నేను సన్నిహితంగా ఉండటంతో పాటు రాక పోకలు జరుగుతున్నాయని సుమంత్‌ చెప్పాడు. రెండవ పెళ్లిపై మాత్రం ప్రస్తుతానికి ఏ ఆలోచన లేదని సుమంత్‌ అన్నాడు.