సింగర్ సునీత ఇటీవలే మ్యాంగో మీడియా సంస్థ అధినేత రామ్ వీరమాచినేని ని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత వీరిద్దరు హ్యాపీ జీవితాన్ని లీడ్ చేస్తారని అంతా భావిస్తున్నారు. ఈ వయసులో వీరిద్దరికి కూడా తోడు నీడ చాలా అవసరం. ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా శేష జీవితంను గడిపేస్తారనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రామ్ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
మ్యాంగో మీడియా ద్వారా రామ్ బాగానే సంపాదించారు. అంతకు ముందు రామ్ కు ఉన్న బిజినెస్ లు స్థిరాస్తులు అన్ని కలిపి దాదాపుగా వందల కోట్లు ఉంటాయని అంటున్నారు. రాజకీయంగా కూడా రామ్ కుటుంబంకు పలుకుబడి ఉన్నట్లుగా చెబుతున్నారు. సినీ మరియు రాజకీయ ప్రముఖులతో ఉన్న సన్నిహిత్యంతో వారితో వ్యాపారాలు చేస్తున్న రామ్ కు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. సునీత పిల్లలకు రామ్ ఆర్థిక భరోసా కల్పించే అవకాశం ఉంది. తద్వార అన్ని విధాలుగా రెండు వైపుల సంతోషంగా ఉండే అవకాశం ఉందంటున్నారు.