రాణా ట్రాక్‌ తప్పుతాడని సురేష్‌ భయం

హీరోగా కొనసాగుతూనే నిర్మాతగాను ప్యారలల్‌గా బిజీ అవుదామని రాణా దగ్గుబాటి ప్లాన్‌ చేసుకున్నాడు. నాగచైతన్యతో ఒక చిత్రం నిర్మిస్తానని కూడా రాణా ప్రకటించాడు. అయితే ఆ ప్రాజెక్ట్‌ ఇప్పుడు చేతులు మారింది. రాణాకి ‘బాహుబలి’తో నటుడిగా ఐడెంటిటీ దక్కింది. ‘బాహుబలి 2’ తర్వాత అతని కెరియర్‌ టర్న్‌ అవుతుందనే అంచనాలున్నాయి. మరోవైపు హీరోగాను బిజీ అవుతున్నాడు.

ఇలాంటి టైమ్‌లో నిర్మాణం అంటూ పక్కదారి పట్టకూడదని సురేష్‌బాబు ఫిక్సయ్యారు. తనయుడికి ఇష్టమైనప్పటికీ నిర్మాణం జోలికి రావద్దని వారించారు. వెంకటేష్‌ నటన, సురేష్‌బాబు నిర్మాణం అని ఎంచుకున్నప్పుడు వెంకీని నిర్మాణం వైపు రాకుండా చూసుకున్నారు.

అతడి దృష్టి మొత్తం నటన మీదే వుంచేలా జాగ్రత్త పడ్డారు. వెంకటేష్‌ స్టార్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. అదే పద్ధతి రాణా విషయంలోను ఫాలో అవుతున్నారు. రామ్‌ చరణ్‌లాంటి వాళ్లు నటిస్తూ నిర్మాతలుగా కూడా మారుతున్నప్పటికీ సురేష్‌బాబు దానికి వ్యతిరేకం.

నటుడిగా సక్సెస్‌ రానపుడు ప్రొడక్షన్‌ వైపు వెళ్లాలే తప్ప అక్కడ సక్సెస్‌ అయినప్పుడు ఈ అనవసరపు తలనొప్పులు వద్దనేది ఆయన అభిమతం. కొంతకాలంగా తనే పూర్తిగా సోలో ప్రొడక్షన్‌ ఆపేసి వేరే నిర్మాతలతో టైఅప్‌ అవుతున్నారు. ఇలాంటి టైమ్‌లో రాణాని మాత్రం ఇందులోకి ఎలా దిగనిస్తారు?