బాండ్‌ హీరోయిన్‌ తాన్య మృతి

హాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ తాన్య రాబర్డ్స్‌ మృతి చెందారు. ఆమె జేమ్స్ బాండ్‌ హీరోయిన్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. డిసెంబర్‌ 24వ తారీకున పెంపుడు కుక్కలతో వాకింగ్‌ వెళ్లిన తాన్య అకస్మాత్తుగా కింద పడిపోయారు. దాంతో ఆమెను ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె ఆసుపత్రిలో చికిత్స అందుకుంటూ ఉన్నారు. సోమవారం రాత్రి సమయంలో ఆమె ఆరోగ్యం మరింతగా క్షీనించిందని ఆమెకు కృత్రిమ శ్వాస అందించినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని వైధ్యులు పేర్కొన్నారు.

హీరోయిన్ గానే కాకుండా తాన్య మోడల్ గా నిర్మాతగా ఫిల్మ్‌ మేకర్ గా బుల్లి తెరపై వెండి తెరపై సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేశారు. 1970 నుండి ఆమె ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తూనే వచ్చారు. మొదట సీరియల్‌ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న తాన్య హీరోయిన్‌గా మారి బాండ్‌ హీరోయిన్‌ అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా ఇమేజ్‌ సొంతం చేసుకుంది. లేడీ జేమ్స్ బాండ్‌ అంటూ ఈమెను అభిమానులు పిలుచుకునే వారు. తాన్య మృతితో అభిమానులు దిగ్ర్బాంతిని వ్యక్తం చేస్తున్నారు.