తమిళ్ టాప్ హీరో విజయ్ ప్రస్తుతం బీస్ట్ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక దీని తర్వాత విజయ్ తెలుగు – తమిళ్ ద్విభాషా చిత్రంలో నటించనున్న విషయం తెల్సిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించనున్నాడు. అందులో ఒకటి యువకుడి పాత్ర కాగా, రెండోది ఏరోతోమానియా అనే లక్షణమున్న వయసు మళ్ళిన పాత్ర. ఇదే కనుక నిజమైతే విజయ్ కెరీర్ లో నాలుగో సారి డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు.
దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.