దర్శకధీరుడు రాజమౌళి ఓ సినిమా మొదలెడితే, అది పూర్తి అవ్వడానికి కనీసం రెండు, మూడేళ్లు పడుతుంది. అన్నీ సరిగ్గా ఉంటేనే ఇంత టైమ్ పడితే, ఈసారి కరోనా కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌కు అనుకోని బ్రేక్ వచ్చింది. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా నెలరోజుల సమయం వృథా కావడంతో ‘ఆర్ఆర్ఆర్’ అనుకున్న సమయానికి పూర్తి అవుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆలస్యమైతే కనుక త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఈ ఏడాది పట్టాలెక్కడం కష్టమే అంటున్నాయి సినీ వర్గాలు.
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ కల్లా ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌ను పూర్తి చేసి, త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో పాల్గొనాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యపడకపోవచ్చు. మే 3న లాక్‌డౌన్ ఎత్తివేసినా థియేటర్లు తెరుచుకోవడం, మనుషులు గుంపులుగా చేరేందుకు అస్కారం ఉండే షూటింగ్‌లకు ఇప్పట్లో అనుమతులు ఇవ్వడం కష్టమే. దాంతో తిరిగి ‘ఆర్ఆర్ఆర్’ రెగ్యూలర్ షూటింగ్ మొదలు కావడానికి ఎంత లేదన్నా జూన్ లేదా జూలై దాకా వేచిచూడక తప్పదని అంచనా. ‘ఆర్ఆర్ఆర్’ ఆలస్యమైతే ఎన్టీఆర్ వచ్చేదాకా వేచిచూడకుండా, ఈ గ్యాప్‌లో ఏదైనా చిన్న సినిమా చేయాలని చూస్తున్నాడట త్రివిక్రమ్.
ఇంతకుముందు లో బడ్జెట్‌లో ‘అఆ’ సినిమా చేసి, సక్సెస్ కొట్టిన మాటల మాంత్రికుడు ఈ గ్యాప్‌ను కూడా ఓ చిన్న సినిమాతో నింపుకోవాలని చూస్తున్నాడట. ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్‌గా నటించబోతున్నాడని టాక్.