త్రివిక్రమ్ – వెంకీ – నాని.. మళ్ళీ ఫేకే!

త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో చిత్రంతో తిరిగి టాప్ ఫామ్ లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో సినిమాకు కమిటయ్యాడు మాటల మాంత్రికుడు. ఎన్టీఆర్ తో చేసేది పూర్తి స్థాయి ఎంటర్టైనర్ అని వార్తలు వచ్చాయి. అయినను పోయి రావాలె హస్తినకు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు కూడా తెలుస్తోంది. అసలైతే జులై నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడానికి మరింత ఆలస్యమవుతుంది.

ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది. అప్పుడు కానీ మరో సినిమాకు డేట్స్ ఇవ్వలేడు. సో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా మొదలవ్వడానికి మరో ఏడాదైనా పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంత సేపు వెయిట్ చేయకుండా ఈ లోగా మరో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తాడని అంటున్నారు.

హారిక అండ్ హాసిని వాళ్లకు వెంకటేష్ తో ఎలాగు కమిట్మెంట్ ఉంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో సినిమా కంటే ముందు వెంకటేష్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. అయితే అది సోలో ప్రాజెక్ట్ కాకుండా వెంకటేష్, నానిలతో త్రివిక్రమ్ మల్టీ స్టారర్ చేస్తాడని గత రెండు రోజుల నుండి రూమర్స్ షికార్లు చేస్తున్నాయి.

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి. నానికి రెండు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు పూర్తి చేయాలి. వెంకటేష్ కూడా నారప్ప సినిమాను కంప్లీట్ చేయాలి. ఈ ప్రాజెక్టులను పక్కనపెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను చేస్తారని మనం అనుకోలేం. సో ఈ న్యూస్ ను కూడా మనం ఫేక్ అనుకోవచ్చు.