రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత దేశ వ్యాప్తంగా దేవాలయాలు తెరచుకున్నాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనంకు అనుమతులు ఇచ్చారు. అయితే ఇంతలోనే టీటీడీ అధికారి ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ అధికారి ప్రధాన ఆలయం కాకుండా గోవిందరాజస్వామి వారి ఆలయంలో పని చేస్తూ ఉండటంతో టీటీడీ ఊపిరి పీల్చుకుంది. వారం రోజుల పాటు అక్కడ పూర్తిగా జన సంచారంను నిషేదించాలని నిర్ణయించారు.
ఈ పాజిటివ్ కేసుతో తిరుమల శ్రీవారి ఆలయ దర్శనంపై ఎలాంటి ప్రభావం ఉండదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయడం వల్ల తిరుమల పూర్తి సురక్షితం అంటూ టీటీడీ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే టీటీడీ మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. భక్తులను తక్కువ సంఖ్యలోనే అనుమతించాలని కూడా నిర్ణయించారు.