గని కోసం బరిలోకి దిగిన ఉపేంద్ర

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం గని. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

గనిలో ఉపేంద్ర ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా కొంత కాలం క్రితం వెల్లడైంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఉపేంద్ర ఈ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టాడు. రీసెంట్ గా ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టారు. ఈరోజు నుండి ఉపేంద్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మే కల్లా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నారు.

బాలీవుడ్ భామ సాయీ మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలియజేసారు.