అందంతో పాటు అందమైన మనసున్న హీరోయిన్‌

కరోనా విపత్తు సమయంలో పలువురు స్టార్స్‌ తమవంతు సాయం అన్నట్లుగా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటికే సినిమా పరిశ్రమ నుండి వందల కోట్ల విరాళాలు కరోనాపై పోరుకు విరాళంగా ఇవ్వడం జరిగింది. వే నుండి కోట్ల వరకు సినిమా సెలబ్రెటీలు చాలా మంది తమ మంచి మనసును చాటుకుని తమవంతు సాయం ప్రకటించారు. తాజాగా బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఊర్వశి రూటేలా తనవంతు సాయంగా కరోనాపై పోరాటానికి అయిదు కోట్ల విరాళంను అందించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా ఈమె డాన్స్‌ క్లాస్‌లు నిర్వహించి ఈ మొత్తంను కూటబెట్టింది. తన 18 లక్షల ఫాలోవర్స్‌ ఇచ్చిన ఈ మొత్తంను కరోనాపై పోరాడుతున్న వైధ్య ఆరోగ్య సిబ్బంది భద్రత కోసం ఇచ్చేందుకు సిద్దం అయినట్లుగా ప్రకటించింది. కరోనా పోరులో తనవంతు చేసింది చిన్న సాయమే అయినా మాకు చాలా సంతోషంగా ఉంది.

నేను నిర్వహించిన ఈ కార్యక్రమంలో తమ భాగస్వామ్యం అందించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ సోషల్‌ మీడియా ద్వారా పేర్కొంది. అయిదు కోట్ల విరాళంను ఇచ్చిన హీరోయిన్‌ గా ఊర్వసి రికార్డు సాధించింది. ఈమె మంచి మనసుకు ప్రస్తుతం నెట్టింట ప్రశంసలు దక్కుతున్నాయి.