స్పెషల్ డేన వకీల్ సాబ్ సెకండ్ సింగిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తై విడుదలకు ముస్తాబవుతోంది. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.

వకీల్ సాబ్ లోని మొదటి పాట మగువా మగువాను మార్చ్ 8, 2020న విడుదల చేసారు. ఆ రోజు మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంగ్ ను విడుదల చేసారు. ఆ పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ ఏడాది మార్చ్ 8న కూడా వకీల్ సాబ్ నుండి ఒక పాట విడుదల కానుంది.

బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ చిత్ర రీమేక్ వకీల్ సాబ్. మహిళలు సమాజంలో ఎదుర్కొనే రుగ్మతలపై ఈ చిత్రాన్ని రూపొందించారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించాడు.