అందనంత ఎత్తున ‘వకీల్‌ సాబ్‌’ టికెట్ల రేట్లు

టాలీవుడ్ సినిమాలకు టికెట్ల రేట్లను ఇష్టానుసారంగా పెంచుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్‌ షోలకు బెన్‌ ఫిట్ షోలకు టికెట్ల రేట్ల విషయంలో గేట్లు తెరిచినట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో టికెట్ల రేట్లు పెంచేస్తున్నారు. దాంతో వకీల్‌ సాబ్ ఇప్పుడు సామాన్య ప్రేక్షకులకు అందనంత దూరంలో ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిడ్‌ నైట్‌ షో లు మరియు బెన్‌ఫిట్‌ షోల విషయంలో అభిమానులు ఉన్న ఉత్సాహం నేపథ్యంలో భారీ మొత్తాన్ని పెడుతున్నారట.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వైజాగ్‌ లోని రెండు సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లలో మిడ్‌ నైట్‌ షోను ప్లాన్‌ చేశారు. అభిమానుల షో గా చెప్పే ఆ షో కు ఏకంగా 1500 రూపాయలను టికెట్‌ ప్రైజ్ గా పెట్టారు. ఇక బెన్‌ ఫిట్‌ షో టికెట్ల రేట్లను 500 లుగా నిర్ణయించారు. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వకీల్ సాబ్‌ రికార్డు సృష్టించడం ఖాయం అనిపిస్తుంది. ఆల్ టైమ్‌ రికార్డుతో వకీల్‌ సాబ్‌ నిలిచే అవకాశం ఉందంటున్నారు.