బాలీవుడ్ సూపర్ హిట్ మెసేజ్ ఓరియంట్ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ విడుదలకు సిద్దం అయ్యింది. ఏప్రిల్ 9వ తారీకున రాబోతున్న ఈసినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 90 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇతర రైట్స్ ద్వారా మరో 60 కోట్ల వరకు వచ్చాయి. ఇంత భారీ మొత్తంను ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ రీమేక్ కు పెట్టడం అనేది చాలా పెద్ద సాహసంగా చెబుతున్నారు. పవన్ పై నమ్మకంతో బయ్యర్లు ఈ మొత్తంను పెట్టారు.
పవన్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ మెసేజ్ ఓరియంటెడ్ కథను కాస్త కమర్షియల్ గా మార్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. పైగా ఈ సినిమాలో హీరో పాత్రకు జోడీని కూడా పెట్టారు. సో ఈ సినిమా కమర్షియల్ మూవీగా మారిపోయిందని బయ్యర్లు ఎగబడి మరీ కొన్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వంద కోట్లను రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వంద కోట్లు అంటే మామూలు విషయం కాదు. సూపర్ డూపర్ హిట్ అయితే తప్ప అంతగా వసూళ్లు రాకపోవచ్చు అంటున్నారు. మరి వకీల్ సాబ్ పరిస్థితి ఏంటీ అనేది మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.