ఎక్స్ క్లూజివ్: వివాదాస్పద నటితో వర్మ నగ్నం సీక్వెల్.!

ఈ లాక్ డౌన్ సమయంలో, షూటింగ్ లు ఆగిపోయిన తరుణంలో ఎవరైనా బాగుపడ్డారంటే అది కేవలం రామ్ గోపాల్ వర్మ అని చెప్పవచ్చు. ఈ లాక్ డౌన్ సమయంలోనే మూడు సినిమాలను విడుదల చేసాడు రామ్ గోపాల్ వర్మ. క్లైమాక్స్, నగ్నం అంటూ రెండు సినిమాలతో లాభాలు అందుకున్నట్లు ప్రకటించాడు వర్మ. పెట్టిన పెట్టుబడికి దాదాపు రెండింతల లాభం అందుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా పవర్ స్టార్ సినిమాను తన సొంత ప్లాట్ ఫామ్ లో విడుదల చేసిన వర్మ.. దీంతో కూడా లాభాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాకు 150 రూపాయలు టికెట్ పెట్టడంతో తాను పెట్టిన పెట్టుబడికి లాభాలు చాలా సులువుగా వచ్చేస్తున్నాయి.

ఇక తాజా సమాచారం ప్రకారం వర్మ నగ్నం సీక్వెల్ ను తెరకెక్కించడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నగ్నం మొదటి భాగాన్ని శ్రీ రాపాక మెయిన్ రోల్ గా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ, దీని సీక్వెల్ కు మరో వివాదాస్పద నటిని ఎంచుకున్నట్లు సమాచారం. ఇటీవలే వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన శ్రీ సుధను నగ్నం సీక్వెల్ కు సంప్రదించాడట.

అయితే ఇంకా శ్రీ సుధ తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది.