లాక్ డౌన్ వేళ కాలక్షేపానికి సినీ తారలు అభిమానులతో చిట్ చాట్లు చేస్తుండటం కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఈ జాబితాలోకి మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కూడా వచ్చేశాడు. మంగళవారం సాయంత్రం అతను ట్విట్టర్లో ప్రశ్న-జవాబుల ప్రోగ్రాం పెట్టాడు. అందులో అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర జవాబులిచ్చాడు. మెగా హీరోల్లో చాలామందికి గుర్రపు స్వారీలో పట్టు ఉంది. మరి నీ సంగతేంటి అని వరుణ్‌ను అడిగితే.. ఒకసారి చరణ్‌తో కలిసి గుర్రపు స్వారీ చేయడానికి ప్రయత్నించానని.. ఐతే కిందపడి గాయపడ్డానని.. దీంతో మళ్లీ దాని జోలికి వెళ్లలేదని వరుణ్ చెప్పాడు.
ఇంతకీ నీ ఫేవరెట్ బాలీవుడ్ హీరో ఎవరంటే షారుఖ్ ఖాన్ అని చెప్పిన.. తనకు నచ్చిన సూపర్ హీరో ఫిలిం బ్యాట్‌మ్యాన్ అని వెల్లడించాడు. తనకు నచ్చిన జానర్ యాక్షన్ అని ఓ ప్రశ్నకు సమాధానంగా వరుణ్ చెప్పాడు.
ఇంట్లో అమ్మకు ఎక్కువ భయపడతావా.. నాన్నకా అని అడిగితే కచ్చితంగా నాన్నకే అన్నాడు వరుణ్. ఎక్కువగా అమ్మాయిల ప్రశ్నలకే జవాబులిస్తున్నావేంటని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే.. అలాంటి పక్షపాతం ఏమీ లేదన్నాడు వరుణ్. సినిమాల్లో మీ లాస్ట్ క్రష్ ఏదని దర్శకుడు హరీష్ శంకర్ అడిగితే.. నా చివరి సినిమా (గద్దలకొండ గణేష్) దర్శకుడంటూ పంచ్ ఇచ్చాడు వరుణ్. చరణ్, బన్నీల గురించి చెప్పమంటే వాళ్లిద్దరూ చాలా హార్డ్ వర్క్ చేస్తారన్నాడు.
ఫేవరెట్ క్రికెటర్ల గురించి అడిగితే యువరాజ్ సింగ్, సెహ్వాగ్‌ల పేర్లు చెప్పాడతను. లాక్ డౌన్ సమయంలో తన బాక్సింగ్ కోచ్ తన వెంటనే ఉన్నాడని.. కొత్త సినిమా కోసం సాధన కొనసాగిస్తున్నానని చెప్పిన వరుణ్.. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇప్పుడు చెప్పలేనన్నాడు. పవన్ కళ్యాణ్‌లో తనకు అత్యంత నచ్చిన గుణం నిజాయితీ అని మరో ప్రశ్నకు జవాబుగా చెప్ఆపడు.