తెలుగు వ్యక్తి.. భారత ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. ఆయన కరోనా లక్షణాలు లేకపోవడంతో ఇన్నాళ్లు ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉన్నారు. ఇప్పుడు ఆయనకు కరోనా నెగటివ్ వచ్చినట్లుగా వైధ్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆయన కుటుంబంలో కూడా ఎవరికి కరోనా లేదని నిర్థారణ అయినట్లుగా సమాచారం అందుతోంది.
వెంకయ్య నాయుడు కరోనా అంటూ నిర్థారణ అయిన సమయంలో చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వయసు రీత్యా ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అంటూ అంతా ఆందోళన వ్యక్తం చేశారు. కాని ఆయన సేఫ్ అయ్యారు.
ఉపరాష్ట్రపతి కార్యాలయం నుండి వచ్చిన ప్రకటన మేరకు ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కరోనా నెగటివ్ రిపోర్ట్ రావడంతో ఆయన మరో వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత తన విధులకు హాజరు అవుతారంటూ వారు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ కూడా కరోనా బారిన పడ్డారు.
దేశంలో ఇప్పటి వరకు నలుగురు సీఎంలు కరోనా బారిన పడ్డారు. మద్య ప్రదేశ్, కర్ణాటక, హరియాణా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ సీఎం కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ముగ్గురు సీఎంలు నెగటివ్ రాగా జైరామ్ కూడా త్వరలో కోలుకుంటారంటూ ఆయన అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.