ఎఫ్3 కోసం హైదరాబాద్ లో స్పెషల్ సెట్!

కొన్ని రోజుల క్రితమే వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా ఎఫ్ 3 సినిమా లాంచ్ అయిన విషయం తెల్సిందే. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు కాగా దిల్ రాజు నిర్మాత. తమన్నా, మెహ్రీన్ ఈ సినిమాలో కథానాయికలుగా నటించనున్నారు. డిసెంబర్ 23 నుండి ఎఫ్ 3 రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఒక స్పెషల్ సెట్ ను వేశారు. ఈ సెట్ లోనే తొలి షెడ్యూల్ ను పూర్తి చేస్తారు. వెంకటేష్ రేపటి నుండి షూటింగ్ లో పాల్గొంటాడు. వరుణ్ తేజ్ వచ్చే నెల షూటింగ్ లో జాయిన్ అవుతాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ తర్వాత చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్ గా పెట్టుకున్నారు.
ఎఫ్2 సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఎఫ్3 రిజల్ట్ పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.