కరోనాతో సీనియర్‌ నటుడు వేణుగోపాల్‌ మృతి

సినీ ప్రముఖులను కరోనా కభలించేస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడి దాన్ని జయించారు. కాని కొందరు మాత్రం కరోనాతో పోరాటంలో ఓడిపోతున్నారు. తాజాగా సినీ నటుడు.. బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన కోసూరి వేణుగోపాల్‌ కరోనాతో మృతి చెందారు.

హైదరాబాద్‌ గచ్చి బౌలీలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఈ నెల ఆరంభం నుండి చికిత్స పొందుతున్న వేణు గోపాల్‌ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో ఆసుపత్రిలో జాయిన్‌ అయిన ఆయన కరోనా నెగటివ్‌ వచ్చిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు.

కరోనా కారణంగా ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. కరోనా నెగటివ్‌ వచ్చినా కూడా ఆయన మళ్లీ కోలుకోలేక పోయాడు అంటూ వైధ్యులు చెబుతున్నారు. వెంటిలేటర్‌ పై గత పది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కాపాడలేక పోయిట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన వేణు గోపాల్‌ ఎఫ్‌ సీ ఐ లో మేనేజర్‌ గా చేసి రిటైర్డ్ అయ్యారు.

గత 30 ఏళ్లుగా ఈయన సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నారు. తెగింపు అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాదరామన్న సినిమా ఈయనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. వేణు గోపాల్‌ మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు.