సీఎంతో సూపర్‌ స్టార్‌ భేటీ కారణం ఏంటో?

తమిళ సూపర్ స్టార్ విజయ్‌ తమిళనాడు సీఎం పళనిస్వామితో భేటీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు రాజకీయాల్లోకి సూపర్‌ స్టార్ విజయ్‌ వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు అంటూ ఆ మద్య వార్తలు వచ్చాయి. ఆయన తండ్రి రాజకీయ పార్టీని కూడా మొదలు పెట్టాడు. వెంటనే తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని వెంటనే తన తండ్రి పెట్టిన పార్టీకి తనకు సంబంధం లేదు అంటూ ప్రకటించాడు. ఈ సమయంలో విజయ్‌ రహస్యంగా వెళ్లి సీఎంను కలవడం వెనుక ఆంతర్యం ఏంటీ అంటీ తమిళ మీడియా వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.

ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం మాస్టర్‌ సినిమా కోసం విజయ్‌ సీఎం పళనిస్వామితో భేటీ అయ్యాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. థియేటర్ల పూర్తి ఓపెన్‌ కు అనుమతులు ఇవ్వాల్సిందిగా విజయ్‌ మాస్టర్ నిర్వాతలతో కలిసి సీఎంకు విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది. రూ.143 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమాను 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదల చేస్తే ఖచ్చితంగా నష్టం వస్తుంది. అందుకే సినిమా విడుదల విషయమై సీఎంతో విజయ్‌ భేటీ అయ్యాడు అంటున్నారు. సినిమా విషయమై అయితే రహస్య భేటీ ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.