‘సలార్‌’ లో ఉప్పెన లాంటి విలన్‌

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ మూవీ షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రెగ్యులర్ షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందబోతున్న ఈ సినిమాలో విలన్‌ పాత్రకు గాను ప్రముఖ బాలీవుడ్‌ స్టార్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ విలన్ పాత్రకు గాను విజయ్‌ సేతుపతిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మాస్టర్ సినిమాలో విజయ్‌ సేతుపతి నటనకు దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ఫిదా అయ్యాడట.

ఒక వైపు హీరోగా చేసుకుంటూ మరో వైపు విలన్‌ రోల్స్ ను పండిస్తున్న విజయ్ సేతుపతి ఇప్పటికే బాలీవుడ్‌ మూవీలో కూడా నటిస్తున్నాడు. కనుక పాన్ ఇండియా క్రేజ్ ఉన్న విజయ్‌ సేతుపతి ఖచ్చితంగా సలార్ కు ఒక మంచి విలన్ గా నిలుస్తాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అంతా అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సలార్‌ సినిమా లో హీరోయిన్ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్ సేతుపతి నటించిన ఉప్పెన సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా వచ్చిన తర్వాత టాలీవుడ్‌ లో మరింత బిజీగా విజయ్‌ సేతుపతి నిలిచే అవకాశం ఉందంటున్నారు.