విశాల్‌ ఆ సినిమా నష్టం భరించాల్సిందే

తమిళ హీరో విశాల్‌ కు ఆయన నటించిన ‘యాక్షన్‌’ చిత్ర నిర్మాణ సంస్థకు మద్య గత కొంత కాలంగా వివాదం కొనసాగుతుంది. యాక్షన్‌ సినిమాకు విశాల్‌ ఏకంగా రూ. 44 కోట్లను ఖర్చు చేయించాడట. సినిమా కనీసం 20 కోట్లు అయినా వసూళ్ల చేయక పోతే ఆ నష్టం నేను భరిస్తాను అంటూ విశాల్‌ నిర్మాణ సంస్థకు అగ్రిమెంట్‌ రాసి ఇచ్చాడట. యాక్షన్‌ గత ఏడాది విడుదల అయ్యి కేవలం 11.7 కోట్లను మాత్రమే వసూళ్లు చేసింది. దాంతో అగ్రిమెంట్‌ ప్రకారం 8.3 కోట్లను చెల్లించాలంటూ నిర్మాణ సంస్థ డిమాండ్‌ చేసింది. ఆ మొత్తం చెల్లించేందుకు గాను చక్ర సినిమా నిర్మాణ బాధ్యతలను ఇస్తానంటూ హామీ ఇచ్చాడు.

ఆ సినిమాను కూడా ఇప్పుడు విశాల్‌ తానే నిర్మించుకున్నాడు. దాంతో యాక్షన్‌ చిత్ర నిర్మాతలు తమకు న్యాయం చేయండి అంటూ కోర్టును ఆశ్రయించారు. చక్ర సినిమా విడుదలకు స్టే కోరుతూ విశాల్‌ తమ డబ్బు చెల్లించిన తర్వాత ఆ సినిమాను విడుదల చేసుకునేలా తీర్పు ఇవ్వాలంటూ నిర్మాతల తరపు న్యాయవాది కోరడం జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం చక్ర మూవీ విడుదలకు స్టే ఇవ్వడం కుదరదు అంటూ తీర్పు ఇచ్చిన కోర్టు తాజాగా నిర్మాతలకు అగ్రిమెంట్‌ లో పేర్కొన్నట్లుగా విశాల్‌ నష్టపరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది.

మద్రాసు హైకోర్టు తీర్పు నేపథ్యంలో విశాల్‌ నెల రోజుల గ్యాప్‌ లో ఆ మొత్తంను నిర్మాణ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో కోర్టు దిక్కారం కింద కేసు నమోదు అవుతుందని హెచ్చించారు. ఈ కేసును పై కోర్టుకు తీసుకు వెళ్లేందుకు విశాల్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొందరు మాత్రం ఆ చిత్ర నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే బెటర్‌ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి విశాల్‌ ఏం చేస్తాడు అనేది చూడాలి.