విష్వక్ సేన్ కు మంచి చాన్స్

ఎవరు సినిమా తరువాత సరైన చిన్న సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నారు నిర్మాత పివిపి. ‘ఓ మై కడవులే’ అనే తమిళ సినిమా హక్కులను కొని వుంచారు. ఈ సినిమా ఎవరితో చేయాలన్నా, ఏ యంగ్ హీరో కూడా రెడీగా లేరు. దాదాపు అందరూ బిజీనే. కరోనా వచ్చి సినిమాలు అన్నీ మరింత వెనక్కు తోసింది. ఇలాంటి టైమ్ లో పివిపి ఈ సినిమాను ఓ యంగ్ హీరోతో చేసేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న విష్వక్ సేన్ తో ఓ మై కడవులే రీమేక్ చేసేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈకాలం యువత వారి ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, ఇలా నవ యువ సంబందాల నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ క్యారెక్టర్ కు దాదాపు యంగ్ హీరోల్లో ఎవరైనా సరిపోతారు. అయితే ఎవరి డేట్ లు దొరకుతాయి, ఎవరు ఓకె అంటారు అన్నదే సమస్య.

విష్వక్ సేన్ అయితే సినిమాను వీలయినంత బడ్జెట్ లో చేసే అవకాశం కూడా వుంటుంది. అందుకే విష్వక్ సేన్ ను పివిపి అప్రోచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బేరసారాలు సాగుతున్నాయని, త్వరలో ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది.