చరణ్‌ గురించి సమంత ఎక్సయిట్‌ అవదేంటి?

చైతన్యతో పెళ్లి నిశ్చయమైన తర్వాత సమంతకి అవకాశాలు తగ్గిపోయిన మాట తెలిసిందే. నాగార్జునకి కాబోయే కోడలితో ఏం చేస్తాంలెమ్మని హీరోలు ఆమెతో నటించడానికి ఆసక్తి చూపించకపోవడంతో పెద్ద చిత్రాల్లో సమంతకి ఆఫర్లు తగ్గిపోయాయి. చాలా గ్యాప్‌ తర్వాత ఆమె ఒక స్టార్‌ హీరో సినిమాలో నటిస్తోంది. రామ్‌ చరణ్‌తో తొలిసారిగా సుకుమార్‌ సినిమాలో నటిస్తోన్న సమంత ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు రాజమండ్రి వెళ్లింది.

తన తదుపరి ఇన్నింగ్స్‌కి చాలా కీలకమైన ఈ చిత్రం పట్ల సమంత తెగ ఎక్సయిట్‌ అయిపోతుందని అనుకుంటే, ఇంతవరకు ఆమె ఈ చిత్రం గురించి ట్వీట్‌ కూడా చేయలేదు. షూటింగ్‌ మొదలైందని సాధారణంగా ఎక్సయిటింగ్‌గా సెల్ఫీలవీ పెడుతుంటుంది. కానీ సెల్ఫీ మాట అటుంచి కనీసం ఈ చిత్రం గురించి ప్రస్తావన కూడా తీసుకు రావడం లేదు. ఈ చిత్రంలో సమంత పేరు ఖరారు అయిన దగ్గర్నుంచీ దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు.

రామ్‌ చరణ్‌ కాకపోయినా ఈ చిత్ర విశేషాలని సమంత షేర్‌ చేసుకుంటుందని ఆమె ట్విట్టర్‌ అకౌంట్‌ రిఫ్రెష్‌ కొడుతూ కూర్చున్న అభిమానులకి ఇంతవరకు ఆ ముచ్చట తీర్చనే లేదు. మరి ఈ చిత్రంలో తన గెటప్‌ గురించి, ఇతర విశేషాల గురించి సైలెంట్‌గా వుండాలని సుకుమార్‌ ఆదేశించాడో లేక టూమచ్‌ ఎక్సయిట్‌మెంట్‌ చూపించకూడదని సమంతే అండర్‌ ప్లే చేస్తోందో కానీ మెగా ఫాన్స్‌ మాత్రం తన ప్రవర్తన పట్ల కాస్త కినుక వహించారు.