ఆ వెయ్యి రూపాయల లెక్క ఏది సీఎం గారు?

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన అమ్మ ఒడి పథకంలో భాగంగా ప్రతి తల్లికి 15 వేల రూపాయలను ఏడాదికి ఇవ్వబోతున్నట్లుగా జగన్‌ పేర్కొన్నారు. మొదటి సంవత్సరం రూ.15 వేల రూపాయలు జమ చేశారు. ఆ తర్వాత అందులో నుండి వెయ్యి రూపాయలను స్కూల్‌ లో ఇవ్వాలని ఆ డబ్బుతో స్కూల్‌ లో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ చేపడుతారు అంటూ సీఎం జగన్‌ సూచించారు. ఖాతాలో పడ్డ డబ్బు తిరిగి ఎలా ఇస్తారు. చాలా మంది తల్లులు వెయ్యి రూపాయలు ఇవ్వలేదు. దాంతో తదుపరి ఏడాది వారికి 15 వేలు కాకుండా 14 వేల రూపాయలు మాత్రమే వేయడం జరిగింది.

555880 మంది నుండి వెయ్యి చొప్పున కట్‌ చేసి 14 వేల రూపాయలు మాత్రమే ఒకొక్కరికి ఇవ్వడం జరిగింది. ఆ వెయ్యి కట్‌ చేయడం వల్ల ప్రభుత్వం వద్ద 15.58 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ మొత్తంను స్కూల్స్‌ కు విడుదల చేసి వాటితో మరుగుదొడ్ల నిర్వహణ చేయాల్సి ఉంటుంది. కాని ఆ డబ్బును ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయడం లేదు. స్కూల్స్‌ ఓపెన్‌ లేని కారణంగానో మరే కారణంగానో గాని కట్‌ చేసిన వెయ్యి ని మాత్రం స్కూల్స్‌ కు ఇవ్వక పోడంతో స్కూల్‌ ప్రిన్సిపల్స్ ఆ డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.