జగనన్న విద్యాదీవెన నగదు జమ..! చదువుతోనే మార్పు: సీఎం జగన్

విద్యతోనే జీవితంలో మార్పులు వస్తాయని.. పేదరికం చదువుకు అడ్డం కాకూడదని సీఎం జగన్ అన్నారు. ‘జగనన్న విద్యాదీవెన’ పధకంలో భాగంగా నగదును సీఎం క్యాంపు కార్యాలయం నుంచి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘అర్హులైన వారందరికీ ఫీజు రీయంబర్స్ మెంట్ చేస్తున్నాం. పధకంలో భాగంగా అక్టోబర్ – డిసెంబర్ 2021కి సంబంధించిన దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధులకు రూ.709 కోట్లను జమ చేస్తున్నాం. విద్యతో పేదరికం దూరమవుతుంది. చదువు కోసం తల్లిదండ్రులు అప్పులు చేసే పరిస్థితి రాకూడదు. క్రమం తప్పకుండా త్రైమాసికం పూర్తయిన వెంటనే చెల్లింపు చేస్తున్నాం. ఊరు నుంచి ఒకరు డాక్టర్‌ అయితే గ్రామమంతా బాగుపడుతుంది’.

‘చదువుతో మెరుగైన పరిస్థితుల్లోకి వెళ్తామని గట్టిగా నమ్మి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకువచ్చిన వ్యక్తి వైయస్సార్. తర్వాత పాలకులు మొక్కుబడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. గత ప్రభుత్వ బకాయిలు 1778 కోట్లను కూడా జమ చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన నాకు చాలా సంతోషాన్నిచ్చే కార్యక్రమాలు’ అని అన్నారు.