అఖిల్ పై వర్మ కన్ను?

అఖిల్ కెరీర్ జంక్షన్ లో నిలబడిపోయింది. తొలి సినిమా అఖిల్ అభీష్టం మేరకు చేసాడు. మలి సినిమా నాగ్ సెట్ చేసాడు. రెండూ కూడా పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఉన్నంతలో హలో బెటర్ ప్రొడక్ట్. తరువాత ఏంటీ? ఇదీ సమస్య. ఏ డైరక్టర్ కూడా ఖాళీ లేరు. పెద్ద డైరక్టర్లు ఎవ్వరూ అఖిల్ వైపు చూడడం లేదు. మీడియం డైరక్టర్లు అంతా నాగ చైతన్య అంటే ఒకె అంటున్నారు తప్ప, అఖిల్ అంటే కాదు. ఎందుకో? అన్నది వారికే తెలియాలి.

మొన్నటికి మొన్న ఓ అప్ కమింగ్ పాపులర్ డైరక్టర్ అఖిల్ ను దృష్టిలో పెట్టుకుని, సబ్జెక్ట్ తయారుచేసి ఒకరిద్దరు నిర్మాతలకు చెబితే, అఖిల్ తప్ప మరెవరైనా అన్న సూచనలు వచ్చాయి. ఎందుకిలా? అన్నది అఖిల్ కూడా ఆలోచించాలి. ఇఫ్పుడు దాదాపు నాగార్జున కూడా తరువాత సినిమా ఏమిటన్నది అఖిల్ కే వదిలేసాడు. అఖిల్ నే కథలు వింటున్నాడు. అసలు కథ ఓకె అయితే అప్పుడు తరువాత సంగతి నాగ్ ఆలోచిస్తాడు. మరోసారి మళ్లీ ఓ పది, పది హేను కోట్లు పొగొట్టుకునే ఆలోచన అయితే నాగ్ చేయకపోవచ్చు.

సరే, ఈ సంగతులు ఇలా వుంచితే, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్ క్యాంప్ అఖిల్ మీద కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆర్జీవీ షూటింగ్ స్పాట్ కు అఖిల్ వెళ్లాడో, లేదా ఆర్జీవీ రమ్మన్నాడో? మొత్తానికి ఏదో జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.అఖిల్ మీద ఒకటి రెండు యాక్షన్ సీన్లు వర్మ టెస్ట్ షూట్ చేసాడని తెలుస్తోంది. అఖిల్ కు రెండు సినిమాల అనుభం వుంది. స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా వుంటుందో తెలియంది కాదు. మరి ఎందుకు మళ్లీ షూట్ చేయడం. అంటే ఇవి చూపించి, అఖిల్ తో సినిమా చేస్తానని వర్మ చెప్పాలనుకుంటున్నారా? అన్నది ఒక అనుమానం.

లేదా ప్రస్తుతం మెహబూబా సినిమా చేస్తున్నారు పూరి జగన్నాధ్. ఆ తరువాత మరేదీ లేదు. మెల్లగా అఖిల్ ను పూరి సైడ్ కు తోయడానికి వర్మ ఏమైనా ప్రయత్నాలు ప్రారంభించారా? అన్నది మరో అనుమానం.మొత్తానికి యంగ్ బ్యాచ్ తో కథలు వింటున్న అఖిల్ మరో పక్క ఈ మాస్ ఫ్లాప్ బ్యాచ్ తో ఎందుకు ట్రయల్స్ వేస్తున్నట్లో?