ప్రేమికుల కోసం బన్నీ గిఫ్ట్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా పేరు సూర్య సినిమా నుంచి ఓ సాంగ్ ను విడుదల చేయబోతున్నాడు బన్నీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పాటతో పాటు మరో సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నాడు బన్నీ. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఆ సాంగ్ రిలీజ్ చేస్తారు.

జనవరి 26న సైనికుల గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఓ పాట విడుదల చేయబోతున్నారు. ఇంకా చెప్పాలంటే అదొక దేశభక్తి గీతం కింద లెక్క. ఫిబ్రవరి 14న మాత్రం.. వాలంటైన్స్ డే సందర్భంగా ఓ డ్యూయట్ ను విడుదల చేయబోతున్నారు. విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడ రామానాయుడు స్టుడియోస్ లో జరుగుతోంది. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కు సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ ను బన్నీపై షూట్ చేస్తున్నారు. పీటర్ హెయిన్స్ దీనికి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ తర్వాత మరో 25రోజుల షూట్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. దాంతో టోటల్ సినిమా కంప్లీట్ అయిపోతుంది.