అజ్ఞాతవాసి: థ్యాంక్స్ చెప్పారు, సీన్ లేపేశారు

నచ్చితే ఉంచడానికి, నచ్చకపోతే తీసేయడానికి అతడు మామూలు స్టార్ కాదు. తెలుగు సినిమా నాలుగు స్తంభాల్లో ఒకడు. అలాంటి వ్యక్తికి సంబంధించిన ఎప్పీయరెన్స్ అజ్ఞాతవాసిలో లేదు. అవును.. పవన్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో వెంకటేష్ లేడు.మొన్నటివరకు ఈ సినిమాలో వెంకటేశ్ ఉన్నాడని, అతడిది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే కాదని, చాలా కీలకమైన పాత్ర అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ సినిమాలో ఎక్కడా వెంకటేశ్ కనిపించలేదు. అలాగని ఇంతకుముందు వచ్చిన వార్తలన్నీ రూమర్స్ కావు. వెంకీపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. కానీ ఆఖరి నిమిషంలో లేపేశారు. అదీ సంగతి.

వెంకీ-పవన్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. పైగా త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా కూడా చేయబోతున్నాడు. ఈ క్యాలిక్యులేషన్స్ ఆధారంగా పవన్ సినిమాలో నటించడానికి వెంకీ ఒప్పుకున్నాడు. కానీ ఇలా ఆఖరి నిమిషంలో అతడు నటించిన సన్నివేశాల్ని తీసేయడం బాధాకరం. అతడి ఫ్యాన్స్ కు అవమానం.

వెంకీ నటించిన సన్నివేశాలు సినిమాలో కనిపించకపోయినా.. యూనిట్ మాత్రం అతడికి సిన్సియర్ గా థాంక్స్ చెప్పింది. కృతజ్ఞతలు చెబుతూ టైటిల్ కార్డ్ వేసింది. బహుశా.. సినిమాకు మరింత హైప్ తీసుకురావడం కోసం కొన్ని రోజులు ఆగి ఆ సన్నివేశాలు జతచేస్తారేమో.