అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఇంద్రగంటి

జెంటిల్ మన్ సినిమా తరువాత దర్శకుడు ఇంద్రగంటికి మాంచి సినిమా సెట్ కాలేదు. దాంతో అడవి శేష్, వెన్నెల కిషోర్, అవసరాల లాంటి వాళ్లతో అమీ తుమీ అంటూ చిన్న సినిమా చేసారు. రిలీజ్ టైమ్ కాస్త రాంగ్ అయింది కానీ, మంచి పేరే వచ్చింది, బాగానే ఆడింది. ఆ తరువాత కూడా ఎందుకో పెద్ద ప్రాజెక్టు ఏదీ సెట్ కాలేదు. సుధీర్ బాబు తో ప్రాజెక్టు చేస్తున్నారని ఇంతకు ముందే వెల్లడించాం. కానీ దానికీ నిర్మాత దొరకలేదు.

దాంతో జెంటిల్ మన్ నిర్మాత కృష్ణ ప్రసాద్ దగ్గరకే మళ్లీ చేరింది ఈ సినిమా కూడా. నిజానికి ఇంద్రగంటితో సమస్య ఏమిటంటే, చేసేవి చిన్న సినిమాలే కానీ, బడ్జెట్ మరీ తక్కువ కాదు. ఆయన రెమ్యూనిరేషన్, కాస్త బెటర్ టెక్నీషియన్లు అన్నీ కలిసి సినిమా బడ్జెట్ ను మీడియం రేంజ్ కు చేర్చేస్తున్నాయి. కానీ సినిమా రేంజ్ చిన్న సినిమా స్థాయిని దాటడం లేదు. దాంతో నిర్మాతకు సంతృప్తి కలగదు. అంతకు ముందు ఆ తరువాత, జెంటిల్ మన్ సినిమాలతో ఇదే పరిస్థితి.

ఈసారి కూడా సుధీర్ కుమార్, అదితీ రావ్ అంటే మహా అయితే నాలుగయిదు కోట్ల రేంజ్. శాటిలైట్ ను దృష్టిలో పెట్టుకుంటే. కానీ ఎంత చేస్తారో చూడాలి.