అనసూయా.. ఆ ఫొటోలో అంత అర్థముందా.?

అనసూయ.. బుల్లితెర ‘హాట్‌’ సుందరి.. వెండితెరపైనా అంతే.! బుల్లితెరపై న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి, యాంకర్‌గా మారిన అనసూయ, ‘జబర్‌దస్త్‌’ పుణ్యమా అని ‘స్టార్‌’ అయిపోయిన విషయం విదితమే. రష్మి రాకతో, అనసూయ ‘జబర్‌దస్త్‌’ నుంచి ఔట్‌ అయిపోయినా, తిరిగి ‘జబర్‌దస్త్‌’లో ఛాన్స్‌ దక్కించుకుంది అనసూయ. ప్రస్తుతం ఇద్దరూ ‘జబర్‌దస్త్‌’ని ‘పంచుకుంటున్నారు’.! ఒకరేమో జబర్‌దస్త్‌, ఇంకొకరేమో ఎక్స్‌ట్రా జబర్‌దస్త్‌ ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్‌ చేసుకుంటున్నారు. అన్నట్టు, ఇద్దరూ సినిమాల్లోనూ కనిపించి మెప్పిస్తున్నారండోయ్.

ఇక, ఈ ఇద్దరి మధ్యా విభేదాలంటూ అప్పుడప్పుడూ గాసిప్స్‌ వస్తూనే వున్నాయి. వాటిని ఈ ఇద్దరూ ఖండించేస్తున్నారు కూడా. అయినా, గాసిప్స్‌ ఆగుతాయా.? అలా అలా వస్తూనే వుంటాయి. జనరల్‌గా ఏదో ఒక కామెంట్‌ చేస్తే చాలు, ఆ కామెంట్‌ చుట్టూ గాసిప్స్‌ పుట్టుకు రావడం సహజమే. అదీ ఒకరి మీద ఒకరు కామెంట్‌ చేసుకున్నారన్నట్లుగా గాసిప్స్‌ వస్తూ, ఇద్దరి మధ్యా ‘స్నేహాన్ని’ ప్రశ్నిస్తున్నాయని అనసూయ ఫీలయ్యిందో ఏమో, సోషల్‌ మీడియాలో తాజాగా ఓ ‘ఇంట్రెస్టింగ్‌ ఫొటో విత్‌ క్యాప్షన్‌’ పోస్ట్‌ చేసింది.

‘ఇద్దరు బలమైన మహిళలు.. ఒకర్ని ఒకరు ఎంకరేజ్‌ చేసుకుంటున్నారు.. అంతే తప్ప, ఒకరి మీద ఒకరు ఏడుస్తూ, దించేసుకోవడంలేదు..’ అన్నది ఆ క్యాప్షన్‌ అర్థం. అనసూయ మనసులో మాట అదిరింది. ఫొటో కూడా కళాత్మకంగానే వుందండోయ్‌. ఇక్కడితో అనసూయ – రష్మి మధ్య వివాదాలంటూ గాసిప్స్‌ ఆగిపోతాయా.? ఏమో చూద్దాం.!