అసలు ఖుష్బూకి ఏమయ్యింది.?

సినీ నటి ఖుష్బూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందనీ, ఆమెకు శస్త్ర చికిత్స జరిగిందనీ, పరిస్థితి విషమంగా వుందనీ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. దాంతో ఆందోలన చెందిన కొందరు ఖుష్బూ సన్నిహితులు, అభిమానులు ఆమె ఆరోగ్యంపై ఆరా తీయడం మొదలుపెట్టారట. ఇంకేముంది, ఖుష్బూ షాక్‌కి గురయ్యింది. అంత తీవ్ర అనారోగ్యమా.? నాకా.? ఛాన్సే లేదంటూ తన ఆరోగ్యంపై ఆరా తీసేందుకు వచ్చిన సన్నిహితులకి ఖుష్బూ నవ్వుతూ క్లారిటీ ఇచ్చేసింది.

ఇక, ఈ విషయమై సోషల్‌ మీడియాలో జరుగుతున్న రాద్ధాంతానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలనుకున్న ఖుష్బూ, మహిళల్లో సర్వసాధారణంగా వచ్చే చిన్నపాటి సమస్య ఫైబ్రాయిడ్స్‌ని పట్టుకుని, అదేదో ప్రాణాపాయం అనేంతలా తనపై గాసిప్స్‌ ప్రచారం చేసేయడమేంటని ప్రశ్నించింది. ‘మినిమమ్‌ నాలెడ్జ్‌ లేకుండా అలాంటి మెడికల్‌ టెర్మ్స్‌ని ఎలా నెగెటివ్‌గా ప్రచారం చేస్తారు.?’ అని మండిపడింది ఖుష్బూ.

‘ఇప్పట్లో బకెట్‌ తన్నేసేందుకు నేను సిద్ధంగా లేను. చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా వున్నానిప్పుడు. దయచేసి ఇలాంటి గాసిప్స్‌ని సోషల్‌ మీడియాలో ప్రచారం చేయొద్దు..’ అంటూ ఖుష్బూ నెటిజన్లకు క్లాస్‌ తీసుకుంది. ‘ఓ మైగాడ్‌.. వీడియోస్‌ కూడా ఎటాచ్‌ చేసేశారా.?’ అంటూ ఖుష్బూ తన ఆరోగ్యంపై జరుగుతున్న దుష్ప్రచారం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది.