ఆర్ఆర్ఆర్ టైటిల్‌పై ఫీడ్ బ్యాక్ ఏంటి?

ఉగాది కానుక‌గా త‌న కొత్త సినిమా టైటిల్‌ను ప్ర‌క‌టించి.. ఏడాది స‌స్పెన్స్‌కు తెర‌దించేశాడు రాజ‌మౌళి. ఆర్ఆర్ఆర్ అనే సంక్షిప్త అక్ష‌రాలు క‌లిసొచ్చేలాగే టైటిల్ ఉంటుంద‌ని జ‌క్క‌న్న గ‌త ఏడాదే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ అక్ష‌రాలు క‌లిసొచ్చేలా అభిమానులు కూడా టైటిల్ సూచించ‌వచ్చ‌ని కూడా అప్పీల్ ఇచ్చాడు. చివ‌రికి ఇప్పుడు రౌద్రం ర‌ణం రుధిరం అంటూ టైటిల్ అనౌన్స్ చేశాడు.

ఊరికే టైటిల్ ప్ర‌క‌టించ‌కుండా మోష‌న్ పోస్ట‌ర్ కూడా వ‌దిలింది చిత్ర బృందం. ఐతే ఈ మోష‌న్ పోస్ట‌ర్లో గ్రాండ్‌నెస్, విజువ‌ల్ ఎఫెక్ట్స్, కీర‌వాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. అన్నిటికీ మించి హీరోల పాత్ర‌ల్ని సూచించే నీరు-నిప్పు కాన్సెప్ట్ విష‌యంలో జ‌నాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ విష‌యంలో జ‌క్క‌న్న అంచ‌నాల్ని అందుకున్నాడు.

కానీ సినిమా టైటిల్ విష‌యంలో మాత్రం జ‌నాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ క‌నిపించ‌ట్లేదు. ఆర్ఆర్ఆర్ అక్ష‌రాలు క‌లిసొచ్చేలా టైటిల్ ఉండాల‌నుకుని జ‌క్క‌న్న ఒక ప‌రిధిలో చిక్కుకుపోయాడ‌నే సంకేతాలు ఇచ్చింది టైటిల్. ఆ అక్ష‌రాలు క‌లిసొచ్చేలా బ‌ల‌వంతంగా ప‌దాల్ని ఇరికించిన ఫీలింగ్ జ‌నాల‌కు క‌లుగుతోంది. జ‌క్క‌న్న ఇంత‌కుముందు తీసిన భారీ చిత్రాల‌కు బాహుబ‌లి, మ‌గ‌ధీర లాంటి గూస్ బంప్స్ ఇచ్చే టైటిళ్లు భ‌లేగా క‌లిసొచ్చాయి. ఒక ప‌దంతో క్యాచీగా అనిపించాయి ఆ టైటిల్స్.

బాహుబ‌లికి అయితే భాష‌తో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా జ‌నాలు క‌నెక్టయ్యారు. ఆ ర‌క‌మైన సౌల‌భ్యం ఆర్ఆర్ఆర్ టైటిల్లో లేక‌పోయింది. హిందీ జ‌నాల‌కు తెలుగుతో పాటు సౌత్ ఇండియ‌న్ భాష‌ల్లో పెట్టిన టైటిళ్లను చూసే జ‌నాలు పెద‌వి విరుస్తుండ‌గా.. హిందీ జ‌నాలు రైజ్ రోర్ రివోల్ట్ అనే ఇంగ్లిష్ టైటిల్‌తో ఏమాత్రం క‌నెక్ట‌వుతారు.. అదెంత మేర మాస్ జ‌నాల్లోకి వెళ్తుంది అన్న‌ది సందేహంగా మారింది.