‘ఆ టైపు సినిమాలకోసం’ మరో పోర్న్‌ స్టార్‌

బాలీవుడ్‌ తెరపై సన్నీలియోన్‌ ఓ వెలుగు వెలుగుతోంది. తెలుగులో ఇప్పటికే ‘కరెంట్‌ తీగ’ సినిమాలో నటించిన సన్నీలియోన్‌, తాజాగా ‘పీఎస్‌వీ గరుడవేగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న విషయం విదితమే. బాలీవుడ్‌ సినిమాల్లోకి రాకముందు సన్నీలియోన్‌ ఓ పోర్న్‌ స్టార్‌. ‘అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’లో సన్నీలియోన్‌ ఒకప్పుడు ఓ సంచలనం. ఆ రంగాన్ని వదిలేసి, ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై వెలిగిపోతోంది సన్నీలియోన్‌.

ఇక, సన్నీలియోన్‌కి పోటీగా అదే పోర్న్‌ ఇండస్ట్రీ నుంచి చాలామందిని దించేందుకు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు ప్రయత్నించారుగానీ, ఆ ప్రయత్నాలేవీ వర్కవుట్‌ కాలేదు. కానీ, ఓ మలయాళ సినీ దర్శకుడు మియా ఖలీఫా అనే పోర్న్‌ స్టార్‌ని రంగంలోకి దించుతున్నాడు. అడల్ట్‌ కామెడీ మూవీ ‘చుంక్జ్‌’కి సీక్వెల్‌గా తెరకెక్కించనున్న సినిమా కోసం మియా ఖలీఫాని ఒప్పించినట్లు దర్శకుడు ఒమర్‌ లులు ప్రకటించడం గమనార్హం.

బాలీవుడ్‌ సినిమాల్లోకి వచ్చే ముందు సన్నీలియోన్‌కి పెద్దగా డాన్స్‌ కూడా రాదు. అయితే, ఆమెకున్న పెద్ద ప్లస్‌ పాయింట్‌, ఆమెకు భారతీయ మూలాలు వుండడమే. సన్నీలియోన్‌తో పోల్చితే, మియా ఖలీఫా కూడా ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగానే వుంటుందనుకోండి.. అది వేరే విషయం. ప్రస్తుతం మియా ఖలీపా కూడా పోర్న్‌ ఇండస్ట్రీకి కొంత దూరంగానే వుంటోంది.

చూద్దాం.. మలయాళ సినిమా ద్వారా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్న మియా ఖలీఫా, సన్నీలియోన్‌కి ఏ స్థాయిలో పోటీ ఇవ్వనుందో.!