ఈవారం ట్రేడ్‌ టాక్‌

Raja the Great Movie HD Stills Ravi Teja Mehreen Pirzada Photos

రాజా ది గ్రేట్‌ అదిరిపోయే ఆరంభ వసూళ్లతో జర్నీ స్టార్ట్‌ చేసింది. తొలి రోజు బిజినెస్‌ సాధారణంగా వున్నా కానీ దీపావళి రోజున బాక్సాఫీస్‌ బాగా క్యాష్‌ చేసుకుంది. గత వారం విడుదలైన ‘రాజుగారి గది 2’ వసూళ్లు పూర్తిగా మందగించడం దీనికి ప్లస్‌ అయింది.

వీకెండ్‌ వరకు రాజా ది గ్రేట్‌ వసూళ్లకి ఢోకా వుండదని ట్రేడ్‌ భావిస్తోంది. మరి ఆ తర్వాత ఈమధ్య కాలంలో వస్తోన్న వీకెండ్‌ సినిమాల్లా ఇది కూడా మందగిస్తుందా లేక నిలబడుతుందా అనేది చూడాలి. రాజుగారి గది 2 చిత్రం మాత్రం వీకెండ్‌ సినిమా అనిపించుకుంది. మొదటి మూడు రోజులు అదరగొట్టిన ఈ చిత్రం నాలుగో రోజుకే బాగా డ్రాప్‌ అయిపోయింది.

తొలి వారంలో పదిహేను కోట్ల షేర్‌ రాబట్టిన రాజుగారి గది 2, సెకండ్‌ వీకెండ్‌లో ఎంత క్యాష్‌ చేసుకుంటుందనే దానిపై రికవరీ ఆధారపడి వుంటుంది. ఈ చిత్రానికి పాతిక కోట్ల షేర్‌ వస్తే హిట్‌ అనవచ్చుననేది ట్రేడ్‌ మాట.