ఈసారి రఘుబాబు వంతు అంట

ఒక్కో సినిమా ఒక్కొ కమెడియన్ కు పేరు తెస్తుంటుంది. షకలక శంకర్ ఓ సినిమాలో చెలరేగి పోతే, పృధ్వీ మరో సినిమాలో చితక్కొట్టేస్తాడు. ప్రేమకథాచిత్రమ్ లో సప్తగిరి, ఆనందో బ్రహ్మ లో వెన్నెల కిషోర్, రాజుగారి గదిలో షకలక శంకర్, పండగచేస్కోలో పృధ్వీ మాదిరిగా.

ఈసారి రఘుబాబు వంతు వచ్చినట్లు తెలుస్తోంది. ఈవారం విడుదలవుతున్న NEXT నువ్వే సినిమా క్లయిమాక్స్ లో రఘుబాబు దున్నేసాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మామూలుగానే మంచి కమెడియన్ అయిన రఘుబాబుకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్, మంచి డైలాగుల పడ్డాయట. దాంతో మనవాడు దున్నేసాడని టాక్.

అంటే మామూలుగానే కమెడియన్ గా బిజీగా వున్న రఘుబాబు ఈ సినిమా తరువాత మరింత బిజీ అవుతాడన్నమాట. అన్నట్లు ఈ సినిమాతో పాటే విడుదలవుతున్న ఏంజెల్ సినిమాలో కమెడియన్ సప్తగిరి ఫుల్ లెంగ్త్ రోల్ చేసాడు. ఈ మధ్య సప్తగిరిని ఫుల్ లెంగ్త్ వాడింది తక్కువ. అందువల్ల ఈ సినిమా తరువాత మళ్లీ కమెడియన్ గా సప్తగిరి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లలో కనిపిస్తాడని అంటున్నారు.