వైరస్ లు ప్రబలడం, వాటి మీద ఫిక్షన్ స్టోరీలు అల్లడం కొత్త కాదు. అలాగే సినిమాలు కూడా కొత్త కాదు. అయితే తెలుగులో ఇలాంటివి మాత్రం కొత్త. డిఫరెంట్ సినిమాలు తీసే డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఆలోచన ఇప్పడు ఈ థీమ్ మీద పడింది. కరోనా నేపథ్యంలో సినిమా చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆలోచన కరోనా వచ్చిన తరువాతది కాదని, డిసెంబర్ లోనే ఆయన ఇలాంటి థీమ్ ఒకటి ప్లాన్ చేసారని సన్నిహితులు చెబుతున్నారు. ఓ అప్ కమింగ్ యంగ్ హీరోతో ప్రశాంత్ వర్మ ఈ సినిమా ప్లాన్ చేసారని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయిందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు రెండు సినిమాలు తీసిన ప్రశాంత వర్మ, ఓ వైవిధ్యమైన దర్శకుడిగా ముద్ర పడ్డారు. ఇప్పడు కరోనా మీద సినిమా తీస్తే, ఆ ముద్ర ను నిలబెట్టుకున్నట్లు అవుతుంది. అందుకే ఆ దిశగా ప్రశాంత్ వర్మ అడుగులు వేస్తున్నట్లు బోగట్టా. ఇలాంటి పానిక్ సినిమాలు హాలీవుడ్ లో కాస్త పకడ్బందీ స్క్రిప్ట్ తో భారీగా రెడీ అవుతాయి. ఇప్పుడు ప్రశాంత్ వర్మ మాత్రం చిన్న హీరోతో డిఫరెంట్ గా చేయాలని ప్రయత్నిస్తున్నారు.