చరణ్ వల్ల 30 కోట్లు పెరిగింది!

చిరంజీవి 152వ చిత్రమైన ఆచార్యలో రామ్ చరణ్ చేయాల్సిన పాత్ర ఇప్పుడు మహేష్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ చిత్రం డిలే అవడంతో చరణ్ ఈ చిత్రానికి అందుబాటులో లేకుండా పోయాడు. ఆచార్య ఇంకా లేట్ అవడానికి వీల్లేదని కొరటాల శివ గట్టిగా చెప్పడంతో చరణ్ కి అనుకున్న పాత్ర మహేష్ కి వెళ్ళింది. అయితే మహేష్ లాంటి టాప్ స్టార్ ఒక అతిథి పాత్ర చేయాలంటే ఖర్చవుతుందిగా.

మహేష్ ఈ చిత్రం కోసం ఎన్ని రోజులు నటిస్తే రోజుకి కోటి చొప్పున ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. మహేష్ పార్ట్ ని ముప్పై రోజుల్లో తీస్తానని కొరటాల చెప్పాడట. అంటే మహేష్ కి ముప్పై కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ రోజులు పడితే రోజుకి అదనంగా చెల్లించుకోవాలి. అదే చరణ్ అయితే ఈ చిత్రానికి నిర్మాత కనుక పారితోషికం మాట ఉండేది కాదు. అతను అందుబాటులో లేకపోవడం వల్ల ఆచార్య బడ్జెట్ ముప్పై కోట్లు పెరిగింది.