రవితేజకి ఉన్న సుఖం శర్వానంద్ కి లేదు!

శర్వానంద్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. చాలా మంది హీరోల మాదిరిగా తనకి హిందీ మార్కెట్ లేదు. రవితేజకి, గోపీచంద్ కి ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కానీ వాళ్ళకి హిందీ దుబ్బింగ్ రైట్స్ బాగా వస్తాయి కనుక నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు.

కానీ శర్వానంద్ కి థియేటర్స్ బిజినెస్ తప్ప బయట నుంచి వచ్చేది అంతగా ఉండదు. అందుకే వరసగా మూడు ఫ్లాప్స్ రావడం, అందులోను కొన్ని సినిమాలకి ఓపెనింగ్ కూడా రాకపోవడం వల్ల నిర్మాతలు వెనకాడుతున్నారు.

జాను విడుదలకి ముందు అతనితో సినిమాలు ప్లాన్ చేసిన నిర్మాతలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. అతనితో సినిమా తీసి రిస్క్ చేయడం కంటే ఫామ్ లో ఉన్న వేరే హీరోలతో చేస్తే బిజినెస్ గ్యారంటీ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శర్వాకి శ్రీకారం కనుక హిట్ ఇవ్వకపోతే కష్టాలు తప్పవు.