టైగర్ జిందా హై: మరో గూఢచారి కథ

ఇండియన్ సినిమాకు గూఢచారి కథలు కొత్తకాదు. కాకపోతే అందులో స్టార్ ఎవరు, మూవీ ఎంత గ్రాండియర్ గా తెరకెక్కిందనేది ఇక్కడ ఇంపార్టెంట్. సరిగ్గా ఇలాంటి కథ, పైన చెప్పుకున్న గ్రాండియర్ లుక్ తో వస్తోంది టైగర్ జిందా హై. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా ట్రయిలర్ విడుదలైంది.

ఎలాంటి సస్పెన్స్ మెయింటైన్ చేయకుండా ట్రయిలర్ లోనే కథ చెప్పేశారు. భారత్ కు చెందిన 25మంది నర్సుల్ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. ఇండియన్ ఏజెంట్ అయిన సల్మాన్ ఖాన్ వాళ్లను ఎలా విడిపించాడనేదే స్టోరీ. కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా ఈ కథ అల్లుకున్నాడు దర్శకుడు అలీ అబ్బాస్.

సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కత్రినాకైఫ్. పాకిస్థానీ గూఢచారిగా కత్రినాకైఫ్ ఇందులో కనిపించనుంది. ఇండియన్ ఏజెంట్, పాకిస్థానీ గూఢచారి మధ్య రొమాన్స్ కూడా ఉంది ఈ సినిమాలో. కంప్లీట్ యాక్షన్ ఎడ్వంచరస్ మూవీగా, సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా, డిసెంబర్ 22న థియేటర్లలోకి వస్తోంది టైగర్ జిందా హై.