తారక్ ప్రోమో అలా ఇలా ఉండదు!

ఆర్.ఆర్.ఆర్. చిత్రంలో రామ్ చరణ్ ప్రోమోని అతని పుట్టినరోజున విడుదల చేసిన రాజమౌళి, ఇప్పుడు తారక్ పుట్టినరోజుకి కొమరం భీమ్ ఇంట్రో వీడియో రెడీ చేస్తున్నాడు. చరణ్ పై ఎక్కువ సన్నివేశాలు తీయకపోవడం వల్ల అల్లూరి సీతారామరాజు ప్రోమోని అలా సింపుల్ గా వాయిస్ ఓవర్ తో కానిచ్చేసారట.

కానీ ఎన్టీఆర్ ప్రోమో మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందని టాక్. తారక్ ప్రోమో బాగా సెట్ చేశారనే ఫీలింగ్, జెలసీ చరణ్ ఫాన్స్ కి కలిగితే కలుగుతుంది కానీ సినిమాపై అంచనాలు తారా స్థాయికి తీసుకెళ్లేలా ఈ వీడియో ఉండాలని రాజమౌళి ఇప్పట్నుంచే వర్క్ స్టార్ట్ చేయించాడట.

చరణ్ వీడియోని విడుదల చేయడానికి వారం ముందే డిసైడ్ అయ్యారట.కానీ ఈసారి రాజమౌళికి చాలా టైం ఉంది కాబట్టి తారక్ ప్రోమో కేక పుట్టిస్తుందని నమ్మకం పెట్టుకోవచ్చు.