తెలుగు తమ్ముళ్ళ కొట్లాట: చినబాబు ఎక్కడట.

ఆయన తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి.. పైగా, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారి పుత్రరత్నం. చంద్రబాబు తర్వాత పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి ఆయనగారే. పరిచయం అక్కర్లేని పేరది. ఆయనగారే, మంత్రి నారా లోకేష్‌.!

రోమ్‌ తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడో లేదోగానీ, తెలుగుదేశం పార్టీ వివాదాలతో తగలబడిపోతోంటే నారా లోకేష్‌ మాత్రం ఎంచక్కా ఫిడేల్‌ వాయించుకుంటూ కూర్చున్నట్టున్నారు.! లేకపోతే, తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి వ్యవహారానికి సంబంధించి లోకేష్‌ ఎందుకు జోక్యం చేసుకోవడంలేదట.?

‘ఆయనేమన్నా పార్టీ మారతానని చెప్పారా.?’ అని మొన్నామధ్యన మీడియా ముందు కస్సుబుస్సులాడిన నారా లోకేష్‌, ‘మీరే గాసిప్స్‌ రాస్తారు.. మీరే వాటి గురించి ప్రశ్నిస్తారు..’ అంటూ మీడియాపైన అసహనం వ్యక్తం చేసేశారు. రేవంత్‌, తాను పార్టీ మారతానని చెప్పలేదు. అక్కడి వరకూ బాగానే వుంది. కానీ, రేవంత్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలంటూ మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ చేసేస్తున్నారు కదా.!

రేవంత్‌రెడ్డి, ఏపీ మంత్రుల మీద విమర్శలు చేశారు. ఆ లెక్కన, నారా లోకేష్‌కీ ఆ విమర్శలు ఎంతో కొంత వర్తిస్తాయి. ఏపీకి చెందిన మంత్రిగా అయినా నారా లోకేష్‌, రేవంత్‌ విమర్శలపై స్పందించడం ఆశ్చర్యకరం. తాజాగా పయ్యావుల కేశవ్‌, రేవంత్‌కీ – టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తెకీ మధ్య ‘వ్యాపార సంబంధాలు’ వున్నాయని ఆరోపించారు. ఇప్పుడన్నా నారా లోకేష్‌ కలగజేసుకుంటారా.? కష్టమే.!

అయినా, టీడీపీ అధినేత చంద్రబాబు విదేశాలకెళితే పార్టీ ఇంతలా గబ్బుపట్టి, రోడ్డున పడ్తుందా.? విదేశాల్లో వుండి, పార్టీని చంద్రబాబు కంట్రోల్‌ చేయలేరా.? చంద్రబాబు తరఫున లోకేష్‌ అయినా పార్టీని ఒడ్డున పడేయలేడా.? అలాంటప్పుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్న పదవి లోకేష్‌కి ఎందుకట