తెలుగు సినిమా ఆనందం ఆవిరైంది!

ఈ ఏడాది ఆరంభంలో రెండు దక్కాయని సినీ విపణిలో ఆనందం తాండవించింది. ఫిబ్రవరిలో కొన్ని ప్లాపులు వచ్చినా కానీ వేసవిలో మళ్లీ సినిమాల సందడి మొదలవుతుందని ఆశ పడ్డారు. అయితే ఊహించని ఉపద్రవంలా ముంచుకొచ్చిన కరోనా ఆనందాన్ని హరించేసింది.

ఇప్పటికే రెండు వారాల పాటు సినిమా రిలీజ్ లు ఆగిపోగా, ఏప్రిల్ లో కూడా కొత్త సినిమాలేవీ విడుదల చేయరాదని ఇప్పటికే అంతర్గతంగా తీర్మానించుకున్నారట. కనీసం ఆరు లేదా ఎనిమిది వారాల పాటు ఈ వైరస్ తాకిడి ఉంటుంది కనుక అంత వరకు సినిమా రిలీజ్ లు, షూటింగులు వద్దని డిసైడ్ అయ్యారట.

ఇది సినీ పరిశ్రమని స్లంప్ లోకి నెడుతుందని, చాలా మంది కార్మికులకి జీవనోపాధి లేకుండా అవుతుందని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి కార్మికుల కోసం ఏదైనా చారిటీ లాంటిది చేస్తారో ఏమో అనేది ఇంకా తెలీదు.