తేజ్ ది కూడా ఓ మంచి ప్రేమకథ

సాయిధరమ్ తేజ్ సినిమాకు మొత్తానికి ఓ టైటల్ ఫిక్స్ చేసుకున్నారు. కరుణాకరన్ డైరక్షన్ లో చేస్తున్న సినిమాకు ఓ డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేయడం విశేషం.

సినిమా కథ, న్యూమరాలజీ ఇలా చాలా విషయాలు పరిగణనలోకి తీసుకున్న తరువాత ‘తేజ్ ది కూడా ఓ మంచి ప్రేమకథ’ అన్న టైటిల్ పిక్స్ చేసుకున్నట్లు తెలిసింది. ఇటీవల డిఫరెంట్ డిఫరెంట్ టైటిళ్లు ఫిక్స్ చేస్తున్నారు. ఆ మధ్య ఉన్నది ఒక్కటి జిందగీ, పడి పడి లేచె మనసు, ఇలా డిఫరెంట్ టైటిళ్లు పెడుతున్నారు.

ఇప్పుడు ఆ కోవలోనే సాయిధరమ్ తేజ్-కరుణాకరన్ సినిమా కోసం కాస్త లెంగ్తీ టైటిల్ నే తీసుకున్నారు. తేజ్ ది కూడా ఓ మంచి ప్రేమ కథ అన్న టైటిల్ కచ్చితంగా జనంలోకి వెళ్లేలాగే వుంది.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విశేషం ఏమిటంటే, సాయిధరమ్ తేజ తొలిసారిగా పూర్తి ప్రేమకథాచిత్రంలో నటిస్తుండడం. ఇప్పటి దాకా మాస్ ఫార్మాట్ లోనే సినిమాలు చేస్తూ వచ్చిన సాయిధరమ్ తేజ, తొలిసారి రూట్ మార్చుకుని, అవుట్ అండ్ అవుట్ ప్రేమకథాచిత్రమ్ లో చేయడం విశేషం. ఈ సినిమాకు క్రియేటివ్ కమర్షియల్స్ కేఎస్ రామారావు నిర్మాత.