లిప్‌కిస్ ఔత్సాహికులకు సమంత గ్రీన్‌సిగ్నల్..!

‘సీన్ డిమాండ్ చేస్తే.. లిప్ ‌కిస్సులు చేస్తా.. అందులో ఎలాంటి సందేహం లేదు..’ అని స్పష్టం చేసింది సమంత. పెళ్లి కావడం, అక్కినేని ఇంటి కోడలు.. అనే ఇమేజ్ ఇవేవీ లిప్ కిస్ సీన్లకు అడ్డం కాదు అని సమంత ఒకే మాటతో తేల్చి చెప్పింది.

బుగ్గలే నొక్కుకుంటారో, మనోభావాలే గాయపరుచుకుంటారో.. నాకవన్నీ తెలీదన్నట్టుగా సమంత మాట్లాడేసింది. ‘సీన్ డిమాండ్ చేస్తే..’ అనే రొటీన్ డైలాగునే వాడినా, లిప్ కిస్సులకు వెనుకాడను అని చెప్పడం ద్వారా సమంత ఔత్సాహిక దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే.

డిమాండ్ చేసే సీన్ రాసుకుని వెళ్తే సమంతతో అలాంటి సీన్ చేయించవచ్చు. అయితే సమంతకు లిప్ కిస్ సీన్లు బాగా అచ్చొచ్చాయి. ఈమె తొలి తెలుగు సినిమా ‘ఏం మాయ చేశావే’లో లిప్ లాక్స్ బాగా హైలెట్ అయ్యాయి.

చాలా లిప్ కిస్ సీన్లే ఉన్నా.. ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించకుండా ఆ సినిమా విజయంలో ఆ రొమాంటిక్ సీన్లు కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత కూడా అడపదడపా సమంత లిక్ కిస్ సీన్లుచేస్తూ వచ్చింది. అయితే ఎక్కడా ఘాటైన ముద్దుల్లేవు. ఆ మధ్య విక్రమ్, ధనుష్ లతో అలాంటి సీన్లు చేసినట్టుంది.

సూర్య సినిమా కోసం బికినీ ధరించింది. బికినీపై అప్పట్లోనే చర్చ జరగగా.. అక్కడ కూడా సీన్ డిమాండ్ చేసిందని సమంత స్పష్టం చేసింది. లిప్ కిస్ సీన్ల విషయంలో తను పక్కా ప్రొఫెషనల్ అని, కాబట్టి నో అనే సమస్యే లేదని సమంత తేల్చి చెబుతోంది.