తేజ-వెంకీ సినిమాకు డేట్ ఫిక్స్

తేజ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ మూవీ లాంఛ్ కు డేట్ ఫిక్స్ అయింది. ఈ ప్రాజెక్టును డిసెంబర్ 13న ప్రారంభించబోతున్నట్టు తేజ కన్ ఫర్మ్ చేశాడు. ఆరోజు వెంకటేష్ పుట్టినరోజు.

మూవీ లాంఛింగ్ తో పాటు రెగ్యులర్ షూటింగ్ ను కూడా అదే రోజు నుంచి కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మూవీకి సంబంధించి తేజ-వెంకీ మధ్య చర్చలు పూర్తయ్యాయి. ఇద్దరూ కూర్చొని స్క్రీన్ ప్లే కూడా లాక్ చేశారు. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పై డిస్కషన్స్ సాగుతున్నాయి.

తేజ-వెంకీ కాంబోలో రాబోతున్న సినిమాలో 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు వెంకీ. ఈ సినిమాలో గుబురు గడ్డంతో ఒకసారి, క్లీన్ షేవ్ లో మరోసారి కనిపిస్తాడట. ఇందులో ఓ ప్రొఫెసర్ క్యారెక్టర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గురు లాంటి సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీ, ఎట్టకేలకు తేజ సినిమాతో మళ్లీ సెట్స్ పైకి రాబోతున్నాడు.

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ కొట్టిన తేజ ఒకేసారి 2ఆఫర్లు అందుకున్నాడు. వీటిలో ఒకటి వెంకీ సినిమా కాగా.. ఇంకోటి ఎన్టీఆర్ బయోపిక్. వెంకీతో సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ బయోపిక్ స్టార్ట్ అవుతుంది.